Nov 22, 2009
May 7, 2009
అనామిక
మాది పెద్దలు కుదిర్చిన పెళ్ళి.పూర్తిగా సాంప్రదాయ పద్దతిలో జరిగింది.ఫోటోలు,జాతకాలు మార్చుకున్నాం.ఏ ఇబ్బంది లేకుండా,ఒకరికి ఒకరు ఫోటోలలో నచ్చడం,జాతకాలు మాచ్ అవ్వడం జరిగిపోయాయి.నేను తనతో ఫోన్లో మాట్లాడాను.ఇద్దరు అపరిచితులు ఏమి మాట్లాడుకోగలరో,అవన్నీ మాట్లాడుకున్నాం. ఇంగ్లీష్ యాక్షన్ మూవీల కన్నా,కెమిస్ట్రీ రియాక్షన్స్ ముఖ్యం అనుకునే అమ్మాయి తను.బెంగుళూరు యూనివర్సిటీ,కెమిస్ట్రీ గ్రూపు లో రీడర్ గా పనిచేస్తోంది. పెళ్ళి తరువాత తను వర్క్ చేయాలన్న ఒక్క నా షరతు మినహా,అన్ని విషయాలు మా పెద్దలు దగ్గరుండి చూసుకున్నారు.ఎంగేజ్మెంట్ అంటూ ఏమీ లేదు. నా దగ్గర రెండు వారాల కంటే ఎక్కువ సమయం లేకపోవడం వల్ల, డైరక్ట్ గా పెళ్ళి ముహూర్తం నిర్ణయించబడింది.హడావుడి గా పెళ్ళి,అప్పగింతలు ముగిసాయి.పెళ్ళి అయిన నాల్గవ రోజునే,ఇండియా వదిలి వచ్చేసాం. తను యుగాంతం వచ్చినట్లు ఏడ్చింది.
ఫ్లేన్ లో కూడా పెద్దగా నాతో మాట్లడలేదు. "ఆ మాత్రం బాధ వుండటం సహజం, రెండు రోజులు తరువాత తనే అడ్జస్ట్ అవుతుందిలే" అని అనుకున్నాను. వెళ్ళిన తరువాత కూడా, పెద్దగా మాట్లాడలేదు. సైలెంట్ గా టి.వి చూస్తూ వుండిపోయింది. చాలా రోజుల వర్క్ బ్రేక్ తరువాత అవ్వడం వల్ల, వెళ్ళిన 4-5 రోజుల వరకు,నాకు తన మూడ్ ని సీరియస్ గా పట్టించుకునే టైం దొరకలేదు. నా మీద నాకే కోపం వచ్చింది. వెంటనే, తనని దగ్గర లో వున్న టెంపుల్ కి తీసుకెళ్ళాను,సాయంత్రం అవ్వడం వల్ల, వాతావరణం చాలా ప్రశాంతంగా వుంది.
"ఇక చెప్పు..ఎందుకలా డల్ గా వున్నావు?"
"నన్నెందు కు తెచ్చావ్ ఇక్కడికి?"
"అంటే? ఏమయ్యింది ఇప్పుడు?"
"నేను ఇంటికి వెళ్తాను"
"ఇక్కడ వున్నది కూడ నీ ఇల్లే కదా?"
"లేదు..మా ఇంటికి వెళ్ళిపోతాను, ఫ్లైట్ టికెట్ రెడీ చెయ్యి.."
"చూడు చిన్నీ..ఎవరికైనా కొత్త ప్లేస్ కి వచ్చినప్పుడు ఇంటి మీద బెంగ ఉండటం సహజం..వచ్చిన కొత్తలో నాకు అలానే అనిపించింది. అయాం సారీ..పని ఎక్కువగా వుండటం వల్ల మనకి బయటికి వెళ్ళడానికి ఇప్పటి దాకా కుదరలేదు. రేపు నిన్ను మా గ్యాంగ్ కి, వాళ్ళ ఫామిలీస్ కి పరిచయం చేస్తాను. నెక్స్ట్ వీక్ మీ ఫ్రండ్ డల్లాస్ లో వుంది అని చెప్పావ్ కదా ..అక్కడికి కూడా వెళ్ళి వద్దాం..నీకు కూడా కొంచం గాలి మార్పు గా ఉంటుంది ..సరేనా?"
"నాకు ఈ ప్లేస్ అస్సలు నచ్చలేదు.. నేను నా ఫ్యామిలి,ప్రండ్స్,కాలేజి అన్నీ మిస్ అవుతున్నాను..నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఒక్కరు కూడా లేరు.. నేను మా ఇంటికి వెళ్తాను"
"ఒక్క నిమిషం లాజికల్ ఆలోచించు. కొన్నాళ్ళ తరువాత పరిచయాలు,సర్కిల్ ఆటోమేటిక్ గా పెరుగుతాయి. కాబట్టి ఒక 10 రోజులు చూసి , తరువాత కూడా నీకు ఇబ్బందిగా అనిపిస్తే, అప్పుడు ఆలోచిద్దాం. ఒకేనా?"
"లేదు..నేను ఇంటికి వెళ్ళాల్సిందే.."
"సరే.. నీ జర్నీ ప్లాన్ ఏంటో చెప్పు..రిటర్న్ టికెట్ ఏరోజుకి బుక్ చేయను?"
"రిటర్న్ టికెట్ వద్దు..నాకు ఈ ప్లేస్ లో వుండటం ఇష్టం లేదు.."
"మతి వుండే మాట్లాడుతున్నావా? "
"ఇక్కడ ఉండటం నచ్చకపోవడం అనేది, నీ దృష్టి లో మతి లేకపోవడం అయితే, అవును..మతి లేకుండానే మాట్లాడుతున్నాను"
"సరే ..ఈ ప్రశ్నకి జవాబు చెప్పాలి అనిపిస్తేనే చెప్పు.. వేరే ఎవరైన ఉన్నారా అక్కడ?"
"లేరు..అసలు సమస్య అది కాదు.... నాకు టికెట్ బుక్ చేయక పోతే, 911 కి ఫోన్ చేస్తాను"
"ముందు కొంచం కూల్ అవ్వు. మన పేరెంట్స్ గురించి ఒక్కసారి ఆలోచించు. పెళ్ళి అయ్యి ఇంకా ఒక నెల కూడా అవ్వలేదు. నువ్వేమో ఇంటికి వెళ్తానూ అంటున్నావ్.. పెళ్ళి తరువాత, ఇక్కడికి రావాలి అని నీకు ముందే తెలుసు కదా ! నువ్వు ఇప్పుడు ఇలా వెళ్తే, మన సంగతి ఏంటి?"
"నేను నిన్ను తప్పు పట్టడం లేదు..పొరపాటు నాదే..ఈ మాటే అందరికి చెప్పడానికి కూడా నేను రెడి...నేను నా ఫామిలీ ని వదిలి,ఇంత దూరంలో వుండలేను..కావాలి అంటే, నువ్వే ఇండియా కి రా... "
"నేను కూడా నీ ఫామిలిలో ఒక భాగమే..మరచిపోవద్దు.. అయినా నువ్వు అడుగుతున్నది నాకు సరి అనిపించడం లేదు.."
ఆ రోజే కాదు..తరువాత రోజు కూడా తను మనసు మార్చుకోలేదు..నా ఫ్రెండ్స్ వచ్చారు..నచ్చచెప్పడానికి ట్రయ్ చేసారు...విఫలమయ్యారు...నా ఇష్టానికి వదిలేసి, వెళ్ళిపోయారు.టికెట్ బుక్ చేసి, తన చేతిలో ఉంచాను..ప్రయాణానికి ఇంకా రెండు రోజులు ఉంది. వెళ్ళేంతవరకూ నచ్చచెప్తూనే ఉన్నాను. తను వినకుండా, చిన్న పిల్లలా ఏడుస్తూనే వుంది. రెండు రోజుల తరువాత, వెళ్ళిపోయింది నా చిన్ని..
నిజానికి, ఈ కొద్ది రోజులలో, నేను మిస్ అయ్యేంతగా తను నన్ను ప్రభావితం చేయలేదు. కాని, లోపల ఎక్కడో, నేను తప్పు చేసాను అనే భావన నన్ను తొలచడం ప్రారంభించింది. కాల్ చేసాను. సొంత సిటిని వదిలి రావడం తప్ప, నేను నచ్చకపోవడం అంటూ గాని,మరే రకమైనా ఇబ్బంది కాని, తనకి లేదని చెప్పింది. వాళ్ళ పేరెంట్స్ మర్యాదగా సారీ చెప్పి తమ నిస్సహాయతని తెలియపర్చారు.
నా జీవితం లో నాకు నచ్చిన అమ్మాయిలూ ఒకరిద్దరున్నారు. కాని, ఎవరినీ అంత సీరియస్ గా తీసుకోలేదు. నా పదవ తరగతిలో, క్లాస్ లో ఎప్పుడూ మొదటి ప్లేస్ కోసం నాతో పోటీ పడిన అమ్మాయి ఒకరు అయితే, గ్రాడుయేషన్ లో, మా బ్రాంచ్ బ్యూటీ మరొకరు.. ఒకసారి, ఆ దశ దాటిన తరువాత ఎప్పుడూ వాళ్ళని గురించిన ఆలోచనే ఇంత వరకూ రానేలేదు. I had ignored them once I crossed their paths. కాని, చిన్ని నా భార్య ...I could not ignore her. నేను నా జాబ్ వదిలి, ఇండియా కి వెళ్దామని నిర్ణయించుకున్నాను. అనుకున్నట్టే చేసాను. లగేజ్ మా పేరెంట్స్ దగ్గర వదిలి, బెంగళూరు యూనివర్సిటి కి బయలుదేరి వెళ్ళాను.
నేను వస్తున్నాన్న విషయం కూడ చెప్పలేదు, తనకి సర్ప్రయిస్ ఇద్దామని. అక్కడికి వెళ్లే సరికి, తను క్లాస్ లో వుంది అని తెలిసింది. క్లాస్ అయ్యేంతవరకు, ఎదురుచూసాను. స్టూడెంట్స్ అందరూ బయటికి వచ్చిన తరువాత, అలసిపోయిన వదనంతో, మెల్లగా నడచుకుంటూ, తన బేగ్ ని కస్టపడి మోసుకుంటూ తను బయటికి వచ్చింది. బస్ స్టాప్ వైపు నడవడం మొదలుపెట్టింది. వెనుకగా వెళ్ళి, "మీ బేగ్ ని, కొంచం దూరం మోసుకొని వస్తే, మీకేమయిన అభ్యంతరమా?" అన్ని అడిగాను. వెనుదిరిగి చూసిన తన కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఆనంద పరవశం లో తను, తనని హగ్ చేసుకోవాలా వద్దా అన్న సంద్దిగ్గం లో నేను , కొద్ది క్షణాలు అలానే ఒకరినొకరూ చూస్తుండిపోయాము. -- "నీ చూపు క్షణికం..ఆ తలపు నాకు క్షణక్షణం" -- ముందుగా తేరుకొని, నవ్వుతూ తనతో చెప్పాను. "నీ ప్రశ్నలన్నింటికీ జవాబు తీరికగా తరువాత చెప్తాను. ఒక వారం రోజులు నీతో, నీ ఫేవరేట్ సిటీ లో గడపాలని వుంది నాకు. నీకిష్టమైన ప్రదేశాలన్నీ చూపించు." ఆ ఏడు రోజులూ, ఏడు క్షణాల్లా గడచిపోయాయి. ఈ కలయిక తో, నాకు తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి.
వాళ్ళ ఇంట్లొ ఇప్పటికీ తను చిన్నపిల్లే. తనకి అన్నీ పేరెంట్స్ నే సమకూర్చి పెట్టడం జరుగుతూవచ్చింది.మొండి అనిపించే తన చిన్న పిల్ల లాంటి బిహేవియర్ కి కారణం నాకు అప్పుడు తెలిసింది. నిద్ర లేవగానే కాఫీ తన బెడ్ రూం కి వచ్చేది. ఏ రోజు ఏ డ్రెస్ వేసుకోవాలో వాళ్ళ అమ్మ చెప్పేది. బ్రేక్ ఫాస్ట్ చేసి, బాపూజి నగర్ నుండి బెంగుళూరు యూనివర్సిటీ కి సిటిబస్ లో ఒక గంట ప్రయాణం. బస్ లో కిటికీ ప్రక్కన కూర్చొని, నవల చదవడం తనకిస్టం. యూనివర్సిటీలో లెసన్స్ చెప్పి, సాయంత్రానికి అలసి పోయి, ఇంటికి వచ్చి , రిఫ్రెష్ అయ్యి ప్రెండ్ దగ్గరికి వెళుతుంది. ఒకోరోజు, ఇంట్లోనే టి.వి చూడటమో లేక పాటలు వినడమో చేస్తుంది. వాళ్ళ నాన్న గారు ఇంటికి రాగానే, తనతో కలిసి డిన్నర్ చేస్తుంది. మళ్ళీ సాంగ్స్ వింటూనో, బుక్ చదువుతూనో, నిద్ర పోతుంది.
తన వీకెండ్ దినచర్య లో కూడా పెద్దగా తేడా ఏమీ లేదు. ఆలస్యంగా పడుకోవడం, బ్రంచ్ టైం కి నిద్ర లేవడం, లైబ్రరీ కి వెళ్ళి బుక్స్ తెచ్చుకోవడం, సాయంత్రం టెంపుల్ కి వెళ్ళడం, అక్కడ నుండి సింగింగ్ క్లాస్ కి వెళ్ళి, వచ్చేప్పుడు బయట డిన్నర్ చేసి, ఆలస్యంగా ఇంటికి రావడంతో వీకెండ్ ముగుస్తుంది. అది తన లైఫ్. ప్రతి ఒక్కరూ కోరుకునే సింపుల్, కంటెంట్ అండ్ హ్యాపీ లైఫ్. మరి అలాంటి తన లైఫ్ లో, నేను డెఫినెట్ గా విలన్ నే. అందుకే నా తప్పుని సరిదిద్దుకునేందుకు మొదటి స్టెప్ వేసాను. " నీ గురించి మునుపటి కంటే ఇప్పుడు బెటర్ గా తెలుసు అనుకుంటున్నాను. నీకిస్టమైన సిటిలోనే, పేరెంట్స్ కి దూరంగా, మనమిద్దరం కలసి వుందామా? " అన్నాను. తను సరే అంది.
మొత్తానికి మేము ఒక అపార్ట్ మెంట్ కి షిఫ్ట్ అయ్యాం. వుహించినట్లే. తనకి ఏమీ తెలియదు. ప్రతిదీ నేర్పించాల్సి వచ్చింది. తను నేర్చుకుంది. తనకి కూడా, పర్సనల్ గా కొన్ని భాద్యత లు వున్నాయని, ఒక భర్త వున్నాడు అని అర్థం అయ్యేలా చేయడానికి చెమటోడాల్సి వచ్చింది. మొదట్లో కాఫీ తీసుకెళ్ళి, బెడ్ మీద అందించేవాడిని. షీ మేడ్ సం రూల్స్ అండ్ బ్రోక్ దెం. నా గురించి పట్టించుకునేది కాదు. నాకు చెప్పకుండా ఓక్కోసారి ఇంటికి రాకుండా, డైరక్ట్ గా వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్ళేది. నేను వెళ్ళి తనని ఇంటికి తీసుకొని వచ్చేవాడిని. నిదానంగా, తనకి వైవాహిక జీవితం గురించి, భాద్యత ల గురించి తెలిసింది. తను నిద్ర లేచి నన్ను లేపడం, వంట వండటం, నాతో అప్పుడప్పుడూ మూవీ లు చూడటం, మా ఫ్రండ్స్ ఇంటికి రావడం, వాళ్ళ కాలేజ్ కి & వాళ్ళ ఫ్రండ్స్ ఇంటికి తీసుకెళ్ళడం, నా ముందు పాటలు పాడటం, నాకు కెమిస్ట్రీ టీచ్ చేయడం, తన క్రష్ ల గురించి చెప్పడం, అప్పుడప్పుడూ నన్ను ఏడ్చేలా చేయడం ఫర్ ఏ చేంజ్ . మొత్తానికి రోజురోజుకి తను మెంటల్ గా ఎదిగిపోతుంది. ఒకరోజు, U.S. లో తను తెలియక చేసిన పనికి సారీ కూడా చెప్పింది. నేను "తను ఆ రోజు అలా చెయ్యబట్టే, ఈ రోజు ఈ హపీనెస్" అని నవ్వాను. కాకపోతే, ఈ రోజుకి కూడా తన ఇష్టప్రకారం ఏదయినా జరగకపోతే, ఏడ్చిగోల చేస్తుంది నా చిన్ని ఉరఫ్ గీతిక. నేను అలాంటప్పుడు, తను U.S లో నన్ను 911 కి కాల్ చేస్తానని ఎలా బెదిరించిందో గుర్తుచేసి ఇంకా ఏడిపిస్తాను.
ఇప్పుడు, నా జీవితంలో నాకు నచ్చినదే కాదు, నేను మెచ్చిన అమ్మాయి నా భార్య అయింది. అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుంది, నేను వెనక్కి రాకపోయివుంటే పరిస్థితి ఎలా వుండేదా అని...
కథా విశేషంబెట్టిదనిన.....
ఎప్పటినుండో బ్లాగ్ లో ఒక తెలుగు కథ వ్రాసి, నాలో ఉన్న రచయితని నిద్రలేపుదామని అనుకుంటున్నాను. చాలా రోజులు ప్రయత్నించిన తరువాత, ఇదిగో ఇప్పటికి కుదిరింది. పారేసిన కలాల్ని వెదుక్కున్నా. నిస్త్రాణమైన ఆలోచనా దొంతర్లని కదిలించా, లీలగా ఎప్పుడో [4-5 ఏళ్ళ క్రితం] చదివిన /విన్న ఒక సంఘటనకి కథా రూపాన్ని ఇవ్వాలి అనిపించింది. ఆ ఆధారంతోనే ఈ కథ.
కావాలనే టైటిల్ ని అనామిక అని పెట్టాను. మీరు మాత్రం చదివిన తరువాత, దయచేసి ఒక మంచి టైటిల్ సూచించండి. మంచి టైటిల్ కి ట్రీట్ తప్పకుండా ఇస్తాను. అదేదో మూవీలో హీరో లా కాకుండా, ప్లేస్ నేనే చెప్తున్నా..Corner House, Airport Road, Bangalore అని .. టైం & డేట్ చెప్పాల్సింది మాత్రం నేను కాదు.

Dec 25, 2008
స్వాతి ముత్యం
తను: "మళ్ళీ న్యూ ఇయర్ వచ్చింది" నోటితో మాట్లాడుతూ,నొసటితో వెక్కిరించింది.
నేను:"అయితే ఏంటట?" తాపీగా అన్నాను.
తను:"మరి నువ్వు కొత్త ఆలోచనలు.. సరికొత్త resolution అంటూ బయలుదేరుతావ్ కదా!",అంది కళ్ళ తోనే నవ్వుతూ.
నేను: "మరే!గురివింద గింజ తన క్రింద నలుపెరుగదట!" అన్నాను రోషంగా.
తను: "నా సంగతి ఎందుకులే..నీ సంగతి చెప్పు.."
నేను: "ఇంతకీ, ఏంటి నీ గోల?"
తను: "గోల కాదు బుద్దూ ..గోల్ గురించి అడుగుతున్నా"
నేను: "చెప్పడం కంటే, చేసి చూపిస్తే బాగుంటుంది అనుకుంటున్నా.."
తను: "ఆడియో లేకుండా వీడియో బాగోదేమో?"
నేను: "చెప్తే సటైర్.. చెప్పకపోతే సజషన్..నీకు తెలిసింది అదేనా?"
తను: "అవునని చెబితే?"
నేను: "పొగరు అంటారేమో దానినే.."
తను: "ఏం వుండకూడదా?"
నేను: "నిజం గా పొగరే!"
తను: "అది సరే గాని,ఇంకా నా ప్రశ్న కి జవాబు చెప్పలేదు"
నేను: "చంద్రబింబం లాంటి రూపం ..దాన్ని మించిన వ్యక్తిత్వం..సాంప్రదాయాలను గౌరవించే సౌశీల్యం..ఎదుటి వారిని జయించే ధైర్యం ..కొంచం అహంకారం ..మరికొంత ఆత్మవిశ్వాసం..వీటి మేళవింపే స్వాతిముత్యం లాంటి నువ్వు"
తను: "..."
మొత్తం విని "తను" కళ్ళు తెరచుకొన్నాయి.బుగ్గలు ఎరుపెక్కాయి. నోరు మూతబడింది.....అక్కడి నుండి తుర్రు మంది మరో మాట మాట్లాడకుండా!! రాత కోతల అనుభవంతో,బుర్రసాము చేసి,బయటపడ్డా అప్పటికి..
నీతి: భామ ముందు సాముగరీడీ కి, కర్ర సాము కన్నా బుర్రసాము మిన్న..
Dec 23, 2008
A selfless good deed
On the other day when I watched one episode of f.r.i.e.n.d.s whereby Joey was telling Phoebe there's no such thing as a genuine good deed. I started thinking. Is it really true?
Most of us consider good deeds as selfless and altruistic. However, I would say that all good deeds towards others have a kind of built in personal satisfaction value, giving each of us a kind of better sense of self-worth.
Perhaps the best of a selfless good deed is found in random acts of kindness, when no one but you knows you gave without any sense or need of reciprocation. There are people, who really are willing to sacrifice their time and effort to help others. Of course, I'm not one of those kind of people, cruel as I may seem. But, I love the concept of pay it forward.
I have come across this site called Greater Good , using which you can do a good deed each day with just one simple click! It's indeed that simple! There are six sites, each dedicated to a specific humanitarian need, which you can visit daily and with just a click you will help making a difference in this world.
Think about how much you can do just by taking little time to give few clicks!
Thank You and Merry Christmas everyone !!

Jun 5, 2008
Finding whether someone has blocked you in Google talk or not?
Darn it!! I thought of it for the millionth time. Why he/she is not coming online these days? Is he/she that busy? Hmm…. Do not tell me that some one has dared to block me on Gtalk? How can he/she do this to me? If the other person can’t bear my presence, why he/she has to add me in the first place to the buddy list? Wait a second! Is it happened really or Am I over reacting? How can I find it out?
If you are in the above situation,here’s a trick to get out of it.
S1: Install Pidgin , a great instant messaging utility.
S2: Configure it to work with Gtalk. [A nice HOW TO to configure]
S3: Log in to your Gmail account on Pidgin.
S4: Go to “Buddies” -> “Show Offline Buddies“. (A person who has blocked you must be showing offline to you. So you need to make all offline friends visible)
S5: Now all your contacts are visible to you. Pick any one of those.Right Click on your chosen contact name and select “Get Info“. It will show you the brief information of your contact. This is the expected behavior.
S6: If any of your contact has blocked you on Google Talk, you will not be able to see his/her profile.You will not see anything. Not even the contact’s name.
This goes to show that this particular contact has blocked you on Google Talk and don’t want to talk to you and so it appears to be offline always.
That's awesome,isn't it?

Posted by
Subba Reddy
at
1:26:00 AM
1 comments
Labels:
Block,
Google talk,
Gtalk,
User
Links to this post
Subscribe to:
Posts (Atom)